భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం, కొడిపాక గ్రామానికి చెందిన ఎల్. సాయి చరణ్ రెడ్డి (MBBS విద్యార్థి) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ విభాగంలో రాష్ట్ర సమన్వయకర్తగా నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ చేతుల మీదుగా సాయి చరణ్ రెడ్డి నియామక ఉత్తర్వులను స్వీకరించారు. యువ విద్యార్థి నాయకుడిగా మరియు వైద్య విద్యార్థిగా సాయి చరణ్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ.. ప్రజా ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ముందున్నారు. ఆయన నియామకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్స్ సెల్ కార్యకలాపాలు మరింత విస్తరించి, యువ వైద్య విద్యార్థులను పార్టీ సిద్ధాంతాల వైపు సమీకరించడంలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్, TPCC అధ్యక్షుడు శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్స్ సెల్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
10, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్