భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్

మా స్థలంలోనే బోరింగు ఉంది.. చేతిపంపు చుట్టూ ముళ్లకంప

259cdd39-ad99-4afd-8a65-6fedb5703260

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి చేతిపంపులు, బోర్లు వేసి ప్రజలకు కనీస నీటి అవసరాలు తీరుస్తుంటే, కొందరు వ్యక్తులు తమ అహం కోసం, వ్యక్తిగత కుట్రలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఘటనే బెజ్జికల్లు గ్రామంలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్లు ప్రాథమిక పాఠశాల పక్కన కేవలం ప్రజల నీటి అవసరాల కోసం వేయించబడిన చేతిపంపు వద్ద నీళ్లు తీసుకెళ్లకుండా ఆ స్థలం గల వ్యక్తులు ఎరెడ్ల శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు. మా స్థలంలోనే బోరింగు ఉందని, కావున ఎవ్వరూ నీటి కోసం ఇక్కడికి రావొద్దని, ఇక్కడకు వచ్చి నీళ్ళు పట్టుకపోవద్దని చెబుతూ బోరింగ్ చుట్టూ ఎవ్వరూ రాకుండా చేతి పంపు చుట్టూ చెత్తచెదారం, ముళ్ళ కంప వేశారు. ఉన్నతాధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ వెంటనే స్పందించి చేతిపంపు చుట్టూ చెత్తాచెదారం, ముళ్ళ కంప తీయించి చర్యలు తీసుకోవాలని బెజ్జికల్లు గ్రామస్తులు కోరుతున్నారు.