భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా తాండూర్ మండలంలోని ఐబీ కేంద్రంలో బీఆర్ఎస్ తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణ, వాణిజ్య వ్యాపారులతో పాటు ప్రవేట్ విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొన్నాయి. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు పర్యటించి బోయపల్లి నుంచి ఐబీ వరకు నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మంత్రి తన అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తూ అడ్డదారిలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న బాల్క సుమన్ పై లేనిపోని సెక్షన్లతో కేసులు పెట్టి జైలుకు పంపించడం సరికాదన్నారు. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్న మంత్రి జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందని అన్నారు. వెంటనే బాల్క సుమన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన అందరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, నాయకులు దత్తాత్రేయ రావు, బోనగిరి చంద్రశేఖర్, ఎలుక రామచందర్, మొగిలి శంకర్, మాసాడి శ్రీరాములు, పురుషోత్తం గౌడ్, గట్టు సంతోష్ కుమార్, భీమ లింగయ్య, అడువాల సత్యనారాయణ, పెరిక రాజన్న, బోడ సతీష్, జాడి పోశం, చింటూ, బాబుఖాన్, క్రాంతి కుమార్, రాజేందర్, చోధన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
19, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్