భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర స్థాయి సీఎం కప్ రెస్లింగ్ పోటీలకు అచ్చూలాపూర్ హైస్కూల్ విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి తెలిపారు. ఈ నెల 14న మంచిర్యాలలోని డీవైఎస్ఓ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ రెస్లింగ్ పోటీలలో తాండూర్ మండలం అచ్చూలాపూర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న చౌల్ల హర్షిత అనే విద్యార్థిని పాల్గొని ప్రథమ స్థానంలో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విద్యార్థిని ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీ.ఉమాదేవి, ఏఏపిసి ఛైర్మన్ చిలకమ్మ, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు అభినందించారు.
BHARATH SAMACHAR DIGITAL
21, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్