భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర స్థాయి సీఎం కప్ రెస్లింగ్ పోటీలకు అచ్చూలాపూర్ హైస్కూల్ విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి తెలిపారు. ఈ నెల 14న మంచిర్యాలలోని డీవైఎస్ఓ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ రెస్లింగ్ పోటీలలో తాండూర్ మండలం అచ్చూలాపూర్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న చౌల్ల హర్షిత అనే విద్యార్థిని పాల్గొని ప్రథమ స్థానంలో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విద్యార్థిని ఈ నెల 21 నుంచి…