భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఆగస్టు 2025, సోమవారంభారత్ సమాచార్

బోర్వెల్ లారీని ఢీకొన్న‌ బైక్.. యువకుడు మృతి

01

భార‌త్ స‌మాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోర్వెల్ లారీని బైక్ ఢీకొన‌డంతో ఓ యువకుడు మృతిచెందిన ఘ‌ట‌న ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ అయ్యప్ప టెంపుల్ సమీపంలో గత కొన్ని రోజులుగా ఒక బోర్వెల్ లారీ పార్క్ చేసి ఉంది. శనివారం రాత్రి పోతుగల్ గ్రామానికి చెందిన కొప్పు నరేశ్ (27) బైక్‌పై వెళ్తూ లారీని గమనించక బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను వెంటనే సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన బోర్వెల్ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

మంచి మ‌న‌సు చాటుకున్న ఓదెల న‌రేశ్‌