భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, ఫిబ్రవరి 2026, సోమవారంభారత్ సమాచార్

రేపు హాలియాలో బంజారా భవనాన్ని ప్రారంభించనున్న ఎంపీ

dc89287d-37d9-4033-9ce1-b73fe8fc91c6

భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: అనుముల మండలం హాలియాలో శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట నూతన బంజారా భవనాన్ని ఇటీవల నిర్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం నూతన భవనాన్ని నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ విచ్చేయుచున్నారు. అయితే రేపు జరగబోయే బంజారా భవన్ ప్రారంభోత్సవం, శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి భోగ్ బండార్ కార్యక్రమానికి గిరిజన నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, యువతీ యువకులు, నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరు మండలాల బంజారా సోదరులు పాల్గొని, ఈ కార్యక్రమానన్ని విజయవంతం చేయాలని ఇండియా బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ నాయక్ పిలుపునిచ్చారు.

 

 

 

ఈ కార్యక్రమానికి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచందర్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు బాబురావు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంగోతు భగవాన్ నాయక్, బంజార సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, బంజారా సోదర సోదరీమణులు భారీ ఎత్తున తరలిరానున్నారు. దానిని పురస్కరించుకొని ఆదివారం నాడు హాలియాలో నిర్మించిన బంజారా భవనానికి వెళ్లిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గం అధ్యక్షులు ధానావత్ భాస్కర్ నాయక్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. వారితోబాటుగా నియోజవర్గ ప్రధాన కార్యదర్శి రమావత్ రవి నాయక్, కోశాధికారి బాణావత్ సక్రు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు జటావత్ రవి నాయక్, అనుముల మండలం అధ్యక్షులు సపావట్ పాండు నాయక్, బంజారా నాయకులు బాణావతు లచ్చిరామ్ నాయక్, రమావత్ భిక్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.