భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ.. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రయత్నించడం సరికాదని, బాన్సువాడలో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, హిందువులపై అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున్న కామారెడ్డి వెళతామన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్.రామచందర్ రావును అక్రమంగా అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, నూతన వార్డు కౌన్సిలర్లు ఇప్ప అఖిల భరత్, పబ్బ రాజమణి లక్ష్మణ్, మెదక్ మండల అధ్యక్షురాలు, సర్పంచ్ బెండె వీణా, నందిగామ సర్పంచ్ రమేశ్, జిల్లా నాయకులు లోకేష్, శివ, మల్లేశం, జనార్ధన్, మధుసూదన్, వేణు, ప్రభాకర్, రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాజ్, బిజెపి నాయకులు శ్యాములు, యువమోర్చా నాయకులు బబ్లు, బంటి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్