భారత్ సమాచార్.నెట్, కామారెడ్డి: జిల్లాలోని తిమ్మకుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం చెరువుకు వెళ్లిన 13 ఏళ్ల కవల సోదరులు రామ్, లక్ష్మణ్ నీట మునిగి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థులు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి, సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటం, వారికి ఈత రాకపోవడంతో ఇద్దరూ మునిగిపోయి గల్లంతయ్యారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కవల సోదరుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మరిన్ని కథనాలు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు: ఎంపీ