భారత్ స‌మాచార్.నెట్, కామారెడ్డి: జిల్లాలోని తిమ్మకుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం చెరువుకు వెళ్లిన 13 ఏళ్ల కవల సోదరులు రామ్, లక్ష్మణ్ నీట మునిగి మృతిచెందారు. కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థులు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి, సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటం, వారికి ఈత రాకపోవడంతో ఇద్దరూ మునిగిపోయి గల్లంతయ్యారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం…