భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ వారి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ.. హోలీ సందర్భంగా ఉదయం కామ దహనం నుంచి ప్రారంభం కాగా, సదాశివపేటలోని బసవేశ్వర మందిరం నుంచి బక్కప్ప మందిర్ సిందోల్ శంకర్ గృహము వరకు అక్కడ నుంచి దేశెట్టి బసవరాజు ఇంటి నుంచి బసవేశ్వర మందిరం చేరుకున్నారు. గతంలో పెద్దలు నిర్వహించే మాదిరిగా, ఈ సారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షులు తెలిపారు. ప్రధాన కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరేశలింగాయతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యనిర్వాక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్ మాట్లాడుతూ.. హోలీ పండుగ అంటే కేవలం రంగులను చల్లుకోవడం మాత్రమే కాదని, తోటి వారితో కలిసి నవ్వడం, తోటి వారి సుఖ సంతోషాలలో పాలుపంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ అడ్వకేట్, సమాజ సభ్యులు రాచప్ప, రమేష్, రవి, సురేష్ , శేఖర్, శేఖర్, సతీష్, రవణప్ప, షాబాద్ వీరన్న, మల్లేశం, గౌరీశంకర్, విశ్వనాథ్, ప్రవీణ్, లోకేష్, మల్లేశం, వీరు, వైద్యనాథ్, నర్సింల, నాగు, రాజు, సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
3, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్