భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల పట్టణంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే యువత రంగులతో సందడి చేస్తూ పండుగను జరుపుకున్నారు. వీధుల్లో రంగుల కాంతులతో కళకళలాడగా, ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి యువతతో కలిసి వేడుకల్లో భాగమయ్యారు. పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించే వేదికలని పేర్కొంటూ స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు. రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, మహిపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంటి మల్లేష్, సిజిఆర్ యువసేన సభ్యులు స్థానిక యువకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
3, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్