భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల పట్టణంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే యువత రంగులతో సందడి చేస్తూ పండుగను జరుపుకున్నారు. వీధుల్లో రంగుల కాంతులతో కళకళలాడగా, ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి యువతతో కలిసి వేడుకల్లో భాగమయ్యారు. పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించే వేదికలని పేర్కొంటూ స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు. రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక…