భారత్ సమాచార్.నెట్, జోగులాంబ గద్వాల: ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ టి.నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల హరికృష్ణ, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని (16)తో ఐదు నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. జూన్‌లో ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కు బాలికను పిలిచి, నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి, మరో రెండుసార్లు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఇటీవల బాలికకు వాంతులు కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమె గర్భిణి అని తేలడంతో, తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం హరికృష్ణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
మరిన్ని కథనాలు
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు.. యువతి ఆత్మహత్య