భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: పండ్ల దుకాణం యజమాని, అతని స్నేహితుడు మద్యం మత్తులో దాడి చేయడంతో యువకుడు ఉల్లాకుల రాజేష్ (30) మృతిచెందాడు. ఈ ఘటన శ్రీకాకుళంలో సంచలనం కలిగించింది. ఈ నెల 3న రాత్రి యజమాని వంశీ, అతని స్నేహితుడు రామకృష్ణతో కలిసి రాజేష్‌పై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యజమాని వంశీ రోజువారీ వ్యాపార ఆదాయంపై రాజేష్‌తో గొడవ పడ్డాడు. ఈ గొడవలో వంశీ, అతని స్నేహితుడు రామకృష్ణ కలిసి రాజేష్‌పై పలుమార్లు దాడి చేసి, ఆటోలో తీసుకెళ్లి కొట్టారు. ఆటో నుంచి బయటకు నెట్టివేయడంతో రాజేష్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఘటన జరిగినా కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం చూసేసరికి మద్యం మత్తులో ఉన్నాడని భావించి ఆసుపత్రికి తరలించలేదు. మంగళవారం ఉదయం రాజేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంశీ, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని కథనాలు
‘జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి’