భార‌త్ స‌మాచార్.నెట్, శ్రీకాకుళం: పండ్ల దుకాణం యజమాని, అతని స్నేహితుడు మద్యం మత్తులో దాడి చేయడంతో యువకుడు ఉల్లాకుల రాజేష్ (30) మృతిచెందాడు. ఈ ఘటన శ్రీకాకుళంలో సంచలనం కలిగించింది. ఈ నెల 3న రాత్రి యజమాని వంశీ, అతని స్నేహితుడు రామకృష్ణతో కలిసి రాజేష్‌పై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యజమాని వంశీ రోజువారీ వ్యాపార ఆదాయంపై రాజేష్‌తో గొడవ పడ్డాడు. ఈ గొడవలో వంశీ, అతని స్నేహితుడు రామకృష్ణ కలిసి రాజేష్‌పై పలుమార్లు దాడి చేసి, ఆటోలో…