భారత్ సమాచార్, మార్చి 07, మెదక్ జిల్లా: తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 360 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ ఎస్‌ఐ గంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. సరైన అనుమతులు, పత్రాలు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సివిల్ సప్లై శాఖ ఆర్‌ఐ నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ నగేష్, యజమాని భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సుమారు 360 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారిని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
7, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్