భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, ఆగస్టు 2025, బుధవారంభారత్ సమాచార్

విషాదం.. వరద నీటిలో మునిగి వృద్ధురాలు మృతి

Oplus_16908288

భార‌త్ స‌మాచార్‌.నెట్, వరంగల్: నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన వరంగల్‌లోని 39వ డివిజన్ కాశికుంట వాంబే కాలనీలో జరిగింది. వరద నీరు కింది అంతస్తులోకి భారీగా చేరడంతో లేవలేని పరిస్థితిలో ఉన్న 80 ఏళ్ల పసునూరి బుచ్చమ్మ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందింది. మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో, కరీమాబాద్ సుభాష్ విగ్రహం దగ్గర గల రామ్ లక్ష్మణ్ గార్డెన్‌కు చెందిన ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

వరంగల్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం