భార‌త్ స‌మాచార్‌.నెట్, వరంగల్: నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన వరంగల్‌లోని 39వ డివిజన్ కాశికుంట వాంబే కాలనీలో జరిగింది. వరద నీరు కింది అంతస్తులోకి భారీగా చేరడంతో లేవలేని పరిస్థితిలో ఉన్న 80 ఏళ్ల పసునూరి బుచ్చమ్మ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందింది. మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో, కరీమాబాద్ సుభాష్ విగ్రహం దగ్గర గల…