భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్

హైకోర్టు న్యాయవాది అలేఖ్యకు పురస్కారం

1

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: శంకరం ఫౌండేషన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో మంచిర్యాల కు చెందిన హైకోర్టు న్యాయవాది, బిసి స్టేట్ మహిళా కన్వీనర్ పేరం అలేఖ్య న్యాయ రంగం నుంచి 2026 మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రజని, తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి చంద్రకుమార్, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ, చైర్మన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షురాలు యలవర్తి ధనలక్ష్మి శంకరం ఫౌండేషన్ చేతుల పురస్కారం అందజేసి సత్కరించారు. ఆదివారం రోజున కవుల రచయితల న్యాయమూర్తుల,న్యాయవాదుల,జర్నలిస్టుల, పెద్దల, మహిళ కవుల, పోలీస్, ప్రభుత్వ అధికారుల సమక్షంలో పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పురస్కార గ్రహీతలు, మహిళలు, న్యాయవాది నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.