భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉపకరణాలు అందజేత

d

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలం అచ్చూలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ 2 కేంద్రంలో ఎస్బీఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎస్బీఐ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు అవసరమైన ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మిత్ర హలిస్టిక్స్ హెల్త్ సోసైటి చైర్మన్ లక్ష్మి రెడ్డి, మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎస్‌బీఐ పాన్ ఇండియా సిఎస్‌ఆర్ కార్యక్రమాలను చేపడుతోందని. ఈ కార్యక్రమాల ద్వారా అంగన్‌వాడీలకు అవసరమైన సౌకర్యాలు, వనరులు కల్పించి, పిల్లలు, తల్లులకు పోషకాహార, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరిశేట్టి స్రవంతి శ్రీనివాస్, సిడిపిఓ స్వరుపరాణి, ఉపసర్పంచ్ గట్టు సంతోష్ కూమార్, సెక్రటరీ కల్పన, టిచర్ మల్లుబాయి, ఆశ వర్కర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.