భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

కూరగాయ పంటలపై రైతులకు శిక్షణ

R

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆద్వర్వంలో ఉద్యాన అధికారిని జక్కుల అర్చన అధ్యక్షతన నిర్వహించిన కూరగాయ పంటల్లో ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యాన శాస్త్ర వేత స్రవంతి హాజరై కూరగాయల పంట ఉత్పాదకతను పెంచడానికి నాణ్యమైన విత్తనాల ఎంపిక, నస్సరి నిర్వహణ, పోషకాలు, పురుగుల ,నియంత్రణ వంటి ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారి అర్చన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని. ఉద్యాన డ్రిప్,త్రుంపర, సేద్యం , బందు సేద్యం పరికారాలు, మిల్చ్ పేపర్, కూరగాయల శాశ్వత పంధిరి, గురించి వివరించారు.మాట్రిక్స్ అయిల్ పామ్ కంపెని సిఇఓ ఉదమ్ కుమార్, మార్కెటింగ్ మొక్కల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఓ సుష్మా, ఎఈఓలు శంకర్,వేకటేశం, ధనలక్ష్మీ, రైతులు సత్తన్న, రాజేషం, వెంకటేష్, కిషోర్, పుష్ప,పెరుమాండ్ల భాస్కర్ గౌడ్, గాదె రాజేశం, సీమల రాజలింగం, గుండాల తిరుపతి, మాసాడి తిరుపతి, బోనగిరి చంద్రశేఖర్, జలాల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.