భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

గాంధీభవన్ కు ర్యాలీగా త్రిపురారం యస్.సి కార్యకర్తలు

MM

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్ గా ప్రియతమ నాయకులు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఆలెంపల్లి జానయ్య ఆధ్వర్యంలో త్రిపురారం మండలం నుండి యస్.సి. విభాగ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ పయనమయ్యారు. త్రిపురారం మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్ల చంద్రారెడ్డి, భారతరెడ్డి, లడ్డు నర్సన్న తదితర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ బయలుదేరారు. ఇట్టి కార్యక్రమానికి అంజనపల్లి మాజీ సర్పంచ్ అవిరెండ్ల వీరయ్య, అన్నారం డీలర్ దశరథ, మల్లేష్, కలకొండ శివశంకర మల్లయ్య, జాన్సన్, పొట్టిపాక రవి కుమార్, శేఖర్, అశోక్, తరుణ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.