భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: చెరువులో ఎడ్ల బండి ప్రమాదవశాత్తు బోల్తాపడిన ఘటనలో ఎద్దు మృతి చెందగా, రైతు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దాగం మల్లయ్య, అనే రైతు గురువారం మధ్యాహ్నం సమయంలో తన చెను నుంచి ఎడ్ల బండి కట్టుకుని దగ్గరలో ఉన్న తాండూర్ శివారులోని పెద్ద చెరువుకు ఎద్దులకు నీళ్ళు తాగించెందుకు తీసుకేళ్ళాడు, అక్కడ గుంత లోతుగా ఉండడంతో ఒక్కసారిగా ఎడ్లబండితో పాటు రైతు నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే తేరుకున్న రైతు ఎడ్లబండిని వదిలి అతి కష్టం మీద నీళ్లలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో చెరువులో పడిన రెండు ఎద్దులలో రూ.70 వేలు విలువ గల ఒక ఎద్దు మృతి చెందగా, మరో ఎద్దు ప్రాణాలతో బయటపడింది, రూ. 30 వేల విలువ గల ఎడ్లబండి నుజ్జునుజ్జు అయ్యింది. రైతు దాగం మల్లయ్యకు రూ.1 లక్ష దాకా నష్టం వాటిల్లిందని సంబంధిత అధికారులు స్పందించి, నష్ట పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
12, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్