భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

2

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: మార్చి 14 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి దుర్గం శ్రీనివాస్ తెలిపారు. తాండూర్ మండలంలోని 7 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 417 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో 226 మంది బాలురు, 192 మంది బాలికలు ఉన్నారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 198 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షా సమయం కాగా 5 నిమిషాలు ఆలస్యంగా హాజరైనప్పటికీ అనుమతిస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లను, ముగ్గురు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ముగ్గురు సహాయకులను నియమించడం జరిగిందన్నారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు.కేంద్రానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రతి కేంద్రం వద్ద పోలీస్ సిబ్బందిని నియామించినట్లు తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, పరీక్ష నిర్వహణ సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.