భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

50

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బొల్లారం డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్’లో నివసించే అంకుష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి వారి బృందంతో బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పేద కుటుంబానికి అండగా నిలుస్తూ బృందం సభ్యులతో కలిసి యాబై వేల రూపాయిల(50,000/-rs) ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకి అందించి పెద్ద మనసు చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిన నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.టీ.సీ కృష్ణంరాజు, నాయకులు దీనానాద్, రాజారామ్, మాజీ వార్డు సభ్యుడు భాస్కర్, కార్మిక నాయకులు లక్కన్ సింగ్, సతీష్, ఉద్యానంద్, ఉమాకాంత్, శ్రీరామ్ తివారి, ధర్మేందర్, జితేందర్, మనోజ్, బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.