భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అధికారుల పర్యవేక్షణ లోపం, కంపెనీల నిర్వాహకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవడంతో చేపలు మ్యత్యువాత పడ్డాయి. హత్నూర మండలం పల్పనూరు గౌడిచర్ల గ్రామ శివారులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఉదయం నదిలో మత్సకారులు చేపల వేటకు వెళ్లగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చేపలను చూసి షాక్ అయ్యారు. చేపల మృతితో మంజీరా నది పరిసరాలు కంపు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా మంజీరా నదిలో కలుస్తున్న నక్క వాగులోని పారిశ్రామిక వ్యర్థ జలాలు కలుస్తుండడంతో చేపలు చనిపోయి ఉండొచ్చని మత్స్యకారుల అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ మంజీరా నదిలో పారిశ్రామిక వ్యర్థజలాలతో చేపలు మృతి చెందినట్లు మత్య్సకారులు తెలిపారు.