భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ..

WhatsApp Image 2026-03-23 at 5.16.00 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చట్టపరమైన మార్గంలో ప్రతి బాధితుడికి న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి నేరుగా ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఎలాంటి పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని, ప్రజావాణి ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.