భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చట్టపరమైన మార్గంలో ప్రతి బాధితుడికి న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత సీఐలు,…





