భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

హైదరాబాద్‌లోనే సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మించాలి

WhatsApp Image 2026-03-25 at 6.58.13 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం అడవుల్లోనే ఉండాలా.. మహానగరంలో ఉండకూడదా అని బంజారాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బంజారా నాయకులను తూప్రాన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీల ఆత్మగౌరవ ప్రతీక అయిన సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌లో నిర్మించాలని, లేనిపక్షంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.