భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

పెద్ద గుట్ట దర్గా వద్ద ప్రత్యేక పూజలు

WhatsApp Image 2026-03-25 at 7.50.52 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా తూప్రాన్ పట్టణంలోని గీతారెడ్డి కాలనీలో వెలసిన పెద్ద గుట్ట దర్గా వద్ద బుధవారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మత గురువు ఫాజిల్ బాబా నజీరొద్దీన్ ఛిస్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, పరోపకారమే మానవ జీవిత లక్ష్యమని, సమాజంలో ఐక్యత పెంపొందాలని ఆకాంక్షించారు.

వచ్చే నెల ఏప్రిల్ 10వ తేదీన దర్గా వద్ద ఘనంగా నిర్వహించనున్న ఉర్సు, న్యాజ్ కార్యక్రమాలకు తూప్రాన్ ప్రాంత ప్రజలందరూ భారీగా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.