భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: ఎనిమిది ఏండ్ల పాఠశాల ప్రయాణం.. వెలకట్టలేని స్నేహాలు.. కన్నతండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు.. డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం రోజున జరిగిన 8వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది.7వ తరగతి విద్యార్థులు 8వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా మారింది. పాఠశాల ప్రాంగణంలో గడిపిన ప్రతి క్షణం విద్యార్థుల కళ్లముందు కదలాడాయి. తమను జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరిస్తూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు పలువురి కళ్లు చెమర్చాయి. ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు తమ జీవితాలకు వెలుగునిస్తాయంటూ విద్యార్థులు ఉద్వేగంగా ప్రసంగించారు.ఈ వీడ్కోలు సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, లింబూర్ గ్రామ సర్పంచ్ సుజాత శివారెడ్డి,పి ఆర్ టి యు మండల ఉపాధ్యాయులు సునీల్, ప్రధాన ఉపాధ్యాయులు మరోతి,పాఠశాలలో ఉపాధ్యాయులు కాశిరాం, శంకర్, శ్రీ రంగకుమార్, చంద్రకాంత్, సాయిలు, వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్