భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: ఎనిమిది ఏండ్ల పాఠశాల ప్రయాణం.. వెలకట్టలేని స్నేహాలు.. కన్నతండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు.. డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం రోజున జరిగిన 8వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది.​7వ తరగతి విద్యార్థులు 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా…