భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష

WhatsApp Image 2026-03-26 at 6.44.20 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తూ జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జండపల్లికి చెందిన సోమగారి భాస్కర్ (27) ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో, పక్కా సాక్ష్యాధారాలతో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని, ప్రాసిక్యూటర్లను అభినందించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.