భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తూ జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జండపల్లికి చెందిన సోమగారి భాస్కర్ (27) ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో, పక్కా సాక్ష్యాధారాలతో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1 లక్ష జరిమానా…