భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లాలోని 8 లోక్ అదాలత్ బెంచీలలో మొత్తం 5625 కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠము అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్ సునీత అన్నారు. వనపర్తి జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీపడ దగ్గ కేసులు రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం అని అన్నారు. ప్రతి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు అనగా అన్నదమ్ముల మధ్య తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికిల్ ప్రమాద కేసులు, కుటుంబ తగాద కేసులు, భార్యాభర్తల కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని కేసులను పరిష్కరించుకునే అవకాశం జాతీయ లోక్ అదాలత్ కల్పించిందని సూచించారు. ఈరోజు నిర్వహించిన లోక్అదాలత్ లో జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులు 5625 కేసులు పరిష్కారమయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ.రజని, సీనియర్ సివిల్ జడ్జ్ జీ.కలర్చన, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ టీ.కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బీ.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్.అశ్విని, బార్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
29, మార్చి 2026, ఆదివారంభారత్ సమాచార్