భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

ఏడుపాయలలో భక్తజన సంద్రం

WhatsApp Image 2026-03-29 at 6.47.00 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని మాత సన్నిధి ఆదివారం భక్తజన సంద్రమైంది. వారాంతపు సెలవు కావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదీ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, “శరణు శరణు దుర్గమ్మ” అంటూ అమ్మవారికి జయజయధ్వానాలు చేశారు.

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లికి భక్తులు బోనాలు, ఒడి బియ్యం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో తాగునీరు, క్యూలైన్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొని భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.