భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని మాత సన్నిధి ఆదివారం భక్తజన సంద్రమైంది. వారాంతపు సెలవు కావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదీ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, “శరణు శరణు దుర్గమ్మ” అంటూ అమ్మవారికి జయజయధ్వానాలు చేశారు.

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లికి భక్తులు బోనాలు, ఒడి బియ్యం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని…