భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

వెల్దుర్తి వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి

13

నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర

ఎన్ హెచ్ ఎం జేఏసీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మహేందర్, భరత్, స్టేట్ కోర్ కమిటీ ఆదేశాల మేరకు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సెకండ్ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న మామిడి రజిని ఆ యొక్క పిహెచ్సి లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ అయిన డాక్టర్ శిరీష, డాక్టర్ సౌజన్య ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు పని ఒత్తిడి భారంతో మరియు అనేక రకాలైన ఇబ్బందులకి గురి చేయడం జరిగింది, గత రెండు సంవత్సరాల నుంచి రోజు 12:00 డ్యూటీ చేస్తూ వస్తుంది, మేము చెప్పిన పని చేయకపోతే నీ ఉద్యోగం తొలగిస్తామని భయపెడుతూ DEO పనిచేపించడం అధికమైన ఓపీలు చేయించడం కి సంబంధం లేని ఉద్యోగ విధి నిర్వహణ కార్యక్రమాలు చేపించడం, మరియు మేము ప్రభుత్వ ఉద్యోగులను నువ్వు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగుo మేము తలుచుకుంటే నీ ఉద్యోగం తొలగిస్తామని భయపెడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతూ రావడం జరిగింది ఈ విషయంపై రజిని డిఎంహెచ్ఓ ని కలిసి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఆమెపై ఇద్దరు డాక్టర్లు కక్ష పెంచుకొని మరింత పని భారంతో మాటల దుర్భాషలాడుతూ మానసిక ఒత్తిడికి గురి చేయడం జరిగినది .ఇది ఇలా ఉండగా తేదీ .27 -3 -2026 ఉదయం 11 గంటల సమయంలో వెల్దుర్తి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు UDC ద్వార , రజనీ గారికి ఎలాంటి ఆర్డర్ కాపీ ఇవ్వకుండా, వెల్దుర్తి పీహెచ్ లో కాకుండా మాసాయిపేట్ సబ్ సెంటర్లోకి వెళ్లి విధులు నిర్వహించాలని మాటలతో కూడిన ఆర్డర్ జారీ చేయడం జరిగింది అక్కడ మానసిక ఇబ్బందికి గురి అయిన రజిని వెల్దుర్తి phc ఫార్మసీ లోకి వెళ్లి తలుపులు వేసుకొని మెడ్ ఫార్మిన్ 500 ఎం జి షుగర్ టాబ్లెట్ 4 వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హాస్పిటల్ సిబ్బంది తలుపులు పగలగొట్టి ,హుటాహుటిన 108 కి కాల్ చేసి రజిని గారిని మెదక్ జిల్లాలోని ఏరియా హాస్పిటల్లోకి తీసుకెళ్లి చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆమె పరిస్థితి కొంత విషమంగానే ఉంది.దీనిపై ఎన్ హెచ్ ఎం జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు వెళ్ళి వెల్దుర్తి లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇద్దరి డాక్టర్లపై రజనీ తో ఆయన భర్త ఆయన నర్సింగరావు తో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై వెల్దుర్తి ఎస్సై రాజు సానుకూలంగా స్పందిస్తూ విచారణ చేపట్టి ఇద్దరి డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ సంఘటనపై నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ ఆక్షన్ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాళ్లపల్లి సుమన్ మాట్లాడుతూ వెల్దుర్తిలో సెకండ్ ఏఎన్ఎం రజనీ కి ఏమైనా జరగరానిది జరిగి ప్రాణాలు కోల్పోయినట్లయితే వారి కుటుంబ బాధ్యతను మరియు తల్లి లేని వెలితిని ఎవరు సరి చేస్తారు అని మీడియా సమూహంగా మాట్లాడడం జరిగింది.ఇలాంటి సంఘటనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులను పని బానిసలుగా చేస్తూ వాళ్ళ విధులను కూడా నిర్వర్తించాలని మాటలతో కూడిన ఒత్తిడి చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని , వారికి ఉన్న పలుకుబడితో కాంట్రాక్ట్ లో పనిచేస్తున ఉద్యోగులను ఇలాంటి ఒత్తిడిలకు గురవుతున్నారని తెలియజేస్తూ , వారి యొక్క ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మెదక్ జిల్లాలో ఉన్న డిఎంహెచ్వో ని కలెక్టర్ ని కోరడం జరిగింది.ఇలాంటి చర్యలు పునరుద్ధమైతే నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ ఆక్షన్ కమిటీ లో తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయాలని అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను కూడా గుర్తించాలని వారిని పని ఒత్తిడికి గురి చేయకూడదని కోరడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి వెంకటరమణ మంజుల శ్రీధర్, వెంకటేష్ ,అనిల్ పాల్గొనడం జరిగింది.