భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించనున్న ‘జనగణన-2027’ను అధికారులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత ఇండ్ల గణన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రతి 300 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించి, అధునాతన యాప్ ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, సీపీవో సురేష్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.