భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.
తన భర్త లక్ష్మారెడ్డి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, అసెంబ్లీలో ప్రజల పక్షాన గళం వినిపిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, జిల్లా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ , వెల్దుర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జలాల్పూర్ కిట్టు రమేష్, చందర్ గుప్తా, రమేష్ గుప్తా, పడిగ నరసింహులు, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి, శాకారం శ్రీనివాస్ గౌడ్, బస్వాపూర్ ఉప సర్పంచ్ మల్లేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వేన్నవరం శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు గ్రామ సర్పంచ్ రంగారెడ్డి పలు గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.