భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.
తన భర్త లక్ష్మారెడ్డి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, అసెంబ్లీలో ప్రజల పక్షాన గళం వినిపిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని…





