భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

రేపు బాసరకు సీఎం రేవంత్ రెడ్డి రాక

WhatsApp Image 2026-04-05 at 8.19.36 PM

భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పటిష్టం చేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి సీఎం భద్రతా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పలు అభివృద్ధి పనుల ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు విధులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సీఎం పర్యటన దృష్ట్యా సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాసర ఆలయ పరిసరాల్లో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.