భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

WhatsApp Image 2026-04-06 at 8.10.40 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: కుటుంబ వివాదాల నేపథ్యంలో తన బావను పథకం ప్రకారం హత్య చేసిన నిందితుడు సంతోష్‌కు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు వెల్లడించారు. 2023లో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యపై అప్పటి సీఐ సంజయ్ కుమార్ పక్కా సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ వినిపించిన వాదనలు, పోలీసుల శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ.. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.30,000 జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన టౌన్ సీఐ మహేష్, ఎస్సై విఠల్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కుటుంబ కలహాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలి తప్ప, హింసకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.