భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: కుటుంబ వివాదాల నేపథ్యంలో తన బావను పథకం ప్రకారం హత్య చేసిన నిందితుడు సంతోష్‌కు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు వెల్లడించారు. 2023లో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యపై అప్పటి సీఐ సంజయ్ కుమార్ పక్కా సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ వినిపించిన వాదనలు, పోలీసుల శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి…