భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

విద్యార్థులు ప్రపంచం గర్వించే ఆవిష్కర్తలుగా ఎదగాలి

WhatsApp Image 2026-04-08 at 7.16.23 PM (1)

భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థులు సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రపంచం గర్వించే గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం ‘ట్రినెక్సియా – 2026’ టెక్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సమాజ సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు.

ఈ టెక్ ఫెస్ట్‌లో ఐడియాథాన్, ఈ-స్పోర్ట్స్, టెక్ పల్స్ వంటి ఐదు వినూత్న అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచిన ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు రూ.25,000 నగదు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు, కెరీర్‌కు ఎంతో దోహదపడతాయని అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.