భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, ఏప్రిల్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

హెచ్చు వెంకటేశ్వర్లుకు కార్పొరేషన్ పదవి కేటాయించాలి

WhatsApp Image 2026-04-10 at 5.04.14 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా, మాజీ జెడ్పీటీసీగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన హెచ్చు వెంకటేశ్వర్లుకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కేటాయించాలని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన సేవలు అందించిన వెంకటేశ్వర్లు నాయకత్వాన్ని గుర్తించాలన్నారు.

స్థానిక ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఆయనకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలకు పదవులు ఇస్తే కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తమ్మడపల్లి యాదగిరి, వార్డు మెంబర్ గుజ్జునూరు యశోద, మహంకాళి అనూష, గుజ్జునూరి శ్రీకాంత్, నకిరేకంటి రమ తదితరులు పాల్గొన్నారు.