భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోర మండలం పోచంపాడ్‌లో పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఘర్షణ ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 6న వేముల నర్సింలు, ఉదయ్, కిషోర్, అరవింద్, చందు అనే ఐదుగురు వ్యక్తులు కలిసి దండుగుల రిషిక్‌పై కట్టెలు, కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రిషిక్ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సుహాసిని దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, కట్టెలు, ఒక పల్సర్ బైక్ మరియు ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి వెల్లడించారు.
BHARATH SAMACHAR DIGITAL
10, ఏప్రిల్ 2026, శుక్రవారంభారత్ సమాచార్