భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

WhatsApp Image 2026-04-10 at 6.25.10 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చేగుంట మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. లబ్ధిదారులు దాసరి పద్మ-కృష్ణ దంపతుల నూతన గృహప్రవేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేశామని, త్వరలోనే చేగుంటలో మరో 50 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు.

ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలతో ప్రజలకు చేరువవుతున్నామని చెప్పారు. తమకు ఇల్లు మంజూరయ్యేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక నేతలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఏఎంసీ ఛైర్మన్ తాడేం వెంగళరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, బోనాల సర్పంచ్ సుకన్య నాగులు, ఉపసర్పంచ్ నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ బాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఎం .శ్రీనివాస్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, గ్రామ వార్డు సభ్యులు నాగులు, నరేశ్, భూపతి, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.