భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చేగుంట మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. లబ్ధిదారులు దాసరి పద్మ-కృష్ణ దంపతుల నూతన గృహప్రవేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేశామని, త్వరలోనే చేగుంటలో మరో 50 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని…